రాష్ట్రంలో కొత్తగా 61 డయాలసిస్‌ కేంద్రాలు

రాష్ట్రంలో కొత్తగా 61 డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. జిల్లా, ప్రాంతీయ, సామాజిక ఆసుపత్రుల్లో వీటిని ప్రభుత్వం నెలకొల్పనుంది. వీటి ఏర్పాటుతో ఆయా ఆసుపత్రుల్లో 515

Published : 28 Jun 2022 05:36 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 61 డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. జిల్లా, ప్రాంతీయ, సామాజిక ఆసుపత్రుల్లో వీటిని ప్రభుత్వం నెలకొల్పనుంది. వీటి ఏర్పాటుతో ఆయా ఆసుపత్రుల్లో 515 డయాలసిస్‌ పడకలు అందుబాటులోకి రానున్నాయి. ఈ కేంద్రాలను ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో ఏర్పాటు చేస్తారు. ఆసుపత్రుల్లో అవసరమైన స్థలాన్ని, ఇతర సదుపాయాల్ని వైద్యారోగ్యశాఖ కల్పిస్తుంది. ప్రైవేట్‌ ఏజెన్సీలు యంత్రాలను సమకూరుస్తాయి. డయాలసిస్‌ సేవలందించినందుకు ఏజెన్సీలకు ఆరోగ్యశ్రీ ద్వారా సొమ్ము చెల్లిస్తారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 36 డయాలసిస్‌ యూనిట్లు ఉన్నాయి. కొత్తగా ఏర్పాటు చేసే కేంద్రాలకు ప్రైవేట్‌ సంస్థల కోసం వైద్యారోగ్యశాఖ టెండర్లు పిలవనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు