Published : 28 Jun 2022 05:36 IST

నేషనల్‌ పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌గా ఏఎస్‌ రాజన్‌

ఈనాడు, దిల్లీ, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ నేషనల్‌ పోలీస్‌ అకాడమీ (ఎస్‌వీపీఎన్‌పీఏ) డైరెక్టర్‌గా 1987 బ్యాచ్‌ బిహార్‌ కేడర్‌ ఐపీఎస్‌ అధికారి ఏఎస్‌ రాజన్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన కేంద్రహోంశాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్‌బ్యూరోలో స్పెషల్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. రాజన్‌ను నేషనల్‌ పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌గా నియమించాలని నియామక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ నిర్ణయించినట్లు సిబ్బంది వ్యవహారాలశాఖ సోమవారం జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28న ఆయన పదవీ విరమణ చేసే వరకూ అకాడమీ డైరెక్టర్‌గా కొనసాగనున్నారు. ప్రస్తుతం ఈ స్థానంలో 1988 బ్యాచ్‌ గుజరాత్‌ కేడర్‌ ఐపీఎస్‌ అధికారి అతుల్‌ కర్వాల్‌ సేవలందిస్తున్నారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts