Published : 28 Jun 2022 05:36 IST

రాకేష్‌ కుటుంబానికి రూ.25 లక్షల సాయం

చెక్కు అందించిన మంత్రి ఎర్రబెల్లి
ఆయన సోదరుడికి ఉద్యోగ నియామకపత్రం

ఖానాపురం, న్యూస్‌టుడే: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఇటీవల సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో జరిగిన విధ్వంస సమయంలో కాల్పుల్లో మరణించిన రాకేష్‌ కుటుంబానికి..రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.25 లక్షల ఆర్థిక సాయం చెక్కును మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోమవారం అందజేశారు. మృతుని సోదరుడు రాంరాజ్‌కు నర్సంపేట ఆర్డీవో కార్యాలయంలో ఉద్యోగం ఇస్తూ..సంబంధిత నియామక పత్రాన్ని అందించారు. సోమవారం వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలం దబీర్‌పేట గ్రామంలో రాకేష్‌ దశదినకర్మ సందర్భంగా జరిగిన సంతాపసభకు మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బాధిత కుటుంబాన్ని త్వరలోనే సీఎం కేసీఆర్‌ దగ్గరకు తీసుకెళ్తానని, అసరమైన ఇతర సాయాన్నీ అందించేలా చూస్తానని హామీ ఇచ్చారు. దబీర్‌పేట గ్రామాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని