Published : 28 Jun 2022 05:36 IST

చేపల విక్రయ కేంద్రాల ఏర్పాటు: తలసాని

ఈనాడు, హైదరాబాద్‌ : రాష్ట్రంలోని పలు రిజర్వాయర్ల వద్ద మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు, చేపల విక్రయ కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని  మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం మత్స్యభవన్‌లో పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, గొర్రెల పంపిణీ కార్యక్రమం అమలుపై ఆయన సమీక్ష జరిపారు. మంత్రి మాట్లాడుతూ నూతనంగా నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల వద్ద మత్స్యశాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాల నిర్వహణ కోసం అనువుగా ఉండే 159 ఎకరాల భూమిని గుర్తించామని, అందులో చేపట్టవలసిన అభివృద్ధి పనులపై సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించారు. మత్స్యకళాశాలలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులకు ఈ ప్రాజెక్టులలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఉన్న అవకాశాలతో కూడా ఒక నివేదికను తయారు చేయాలన్నారు. రాష్ట్రంలోనే చేపపిల్లలను ఉత్పత్తి చేసేందుకు సమగ్ర అధ్యయనం చేసి నివేదికను అందజేయాలని కోరారు. ఈ సంవత్సరం రాష్ట్రంలోని 26,778 నీటి వనరులలో 88.52 కోట్ల చేపపిల్లలను, 10 కోట్ల రొయ్య పిల్లలను విడుదల చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. వీటికి సంబంధించిన టెండర్‌ ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని మంత్రి తలసాని ఆదేశించారు. ఇప్పటికే గడువు ముగిసిన మత్స్య సహకార సంఘాలకు ఎన్నికల నిర్వహణ, కొత్త సొసైటీల ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక అందజేయాలని సూచించారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని