Telangana News: సార్‌.. పిల్లిని రక్షించండి.. అర్ధరాత్రి సీపీకి ఫోన్‌

సమయం అర్ధరాత్రి 12 గంటలు.. పోలీస్‌ కమిషనర్‌కు ఫోన్‌.. సార్‌ పిల్లి బావిలో పడింది.. రక్షించండని వేడుకోలు.. వేగంగా స్పందించిన పోలీస్‌ బాస్‌ అధికారులను అప్రమత్తం చేశారు. మార్జాలాన్ని రక్షించారు. ఈ

Updated : 28 Jun 2022 08:34 IST

స్పందించిన పోలీసులు.. మార్జాలం సురక్షితం

కరీంనగర్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: సమయం అర్ధరాత్రి 12 గంటలు.. పోలీస్‌ కమిషనర్‌కు ఫోన్‌.. సార్‌ పిల్లి బావిలో పడింది.. రక్షించండని వేడుకోలు.. వేగంగా స్పందించిన పోలీస్‌ బాస్‌ అధికారులను అప్రమత్తం చేశారు. మార్జాలాన్ని రక్షించారు. ఈ ఘటన కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. స్థానిక విద్యానగర్‌లోని కేడీసీసీ బ్యాంక్‌ వద్ద నివాసం ఉంటున్న మనోహర్‌ ఇంటి వెనకాల ఎవరూ వినియోగించని చేదబావి ఉంది. ఇంటి పరిసరాల్లో సంచరించే రెండు పిల్లులు ఆదివారం సాయంత్రం 5.30 గంటల సమయంలో పోట్లాడుకున్నాయి. ఒక పిల్లి బావిలో పడిపోయింది. అక్కడే ఉన్న మనోహర్‌ కుమార్తె స్నితిక (10వ తరగతి) గమనించి తన తండ్రికి చెప్పింది. వారిద్దరూ గూగుల్‌లో జంతు సంరక్షణ సిబ్బందిని ఆశ్రయించారు. వారి సూచనల ప్రకారం థర్మాకోల్‌ షీట్‌ను బావిలో వేసి పిల్లిని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. జంతువుల సంరక్షణ సిబ్బంది సూచనతో అర్ధరాత్రి మనోహర్‌ కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ వి.సత్యనారాయణ, అగ్నిమాపక సిబ్బందికి ఫోన్‌ చేశారు. స్పందించిన సీపీ ఏసీపీ తుల శ్రీనివాస్‌రావును పురమాయించారు. అర్ధరాత్రి 12.30 గంటలకు జాలి గంపను బావిలోకి పంపి పిల్లిని సురక్షితంగా బయటకు తీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని