రెండు నెలల పన్ను రాబడి రూ.18,751 కోట్లు

రాష్ట్రానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23)లోని మొదటి రెండు నెలల్లో పన్నులు రాబడి రూ.18,751 కోట్లుగా నమోదైంది. ఇది ఏడాది మొత్తం ఆదాయం అంచనా రూ.1,26,606 కోట్లలో 15 శాతం కావడం గమనార్హం. ఇంకా

Updated : 28 Jun 2022 06:17 IST

కాగ్‌కు వివరాలు ఇచ్చిన ఆర్థికశాఖ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23)లోని మొదటి రెండు నెలల్లో పన్నులు రాబడి రూ.18,751 కోట్లుగా నమోదైంది. ఇది ఏడాది మొత్తం ఆదాయం అంచనా రూ.1,26,606 కోట్లలో 15 శాతం కావడం గమనార్హం. ఇంకా రుణాల రూపంలో రూ.274 కోట్లు, పన్నేతర రాబడిగా రూ.913 కోట్లు వచ్చింది. ఏప్రిల్‌, మే నెలల్లో రాష్ట్రానికి మొత్తం మీద రూ.20,227 కోట్లు వచ్చినట్లు ఆర్థికశాఖ వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మే నెల వరకు రాష్ట్ర రాబడులు, వ్యయ వివరాలను ఆర్థికశాఖ కాగ్‌కు అందచేసింది. అత్యధిక ఆదాయం జీఎస్టీ ద్వారా రాగా తర్వాత స్థానంలో అమ్మకం పన్ను ఉంది. మే నెల వరకు ఎక్కువగా వేతనాలకు రూ.6,078 కోట్లు వ్యయం కాగా పింఛన్లు, రెవెన్యూ వ్యయం, రాయితీలు, వడ్డీల చెల్లింపులు ఇతర ప్రధాన వ్యయాలుగా ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని