బ్యాంకు వాయిదాల జాప్యానికి కొనుగోలుదారు బాధ్యుడు కాడు

2011లో కొనుగోలు చేసిన ఫ్లాట్‌ ఇప్పటివరకు అప్పగించకపోవడంతో పాటు 2019 నుంచి కోర్టుల చుట్టూ తిప్పుతున్న ఆదిత్య కన్‌స్ట్రక్షన్స్‌ కొనుగోలుదారుకు పరిహారం చెల్లించాల్సిందేనని రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ తేల్చి చెప్పింది. ఫ్లాట్‌కు 80

Published : 29 Jun 2022 03:53 IST

రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌

ఈనాడు, హైదరాబాద్‌: 2011లో కొనుగోలు చేసిన ఫ్లాట్‌ ఇప్పటివరకు అప్పగించకపోవడంతో పాటు 2019 నుంచి కోర్టుల చుట్టూ తిప్పుతున్న ఆదిత్య కన్‌స్ట్రక్షన్స్‌ కొనుగోలుదారుకు పరిహారం చెల్లించాల్సిందేనని రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ తేల్చి చెప్పింది. ఫ్లాట్‌కు 80 శాతం రుణం పొందినప్పుడు నిర్మాణంలో పురోగతి చూపి బ్యాంకు నుంచి నేరుగా సొమ్ము పొందాల్సి ఉండగా కొనుగోలుదారును బాధ్యుడిని చేయడం సరికాదంది. శేరిలింగంపల్లి మండలం హఫీజ్‌పేటలో ఆదిత్య కన్‌స్ట్రక్షన్స్‌ చేపట్టిన ఆదిత్య ఇంపీరియల్‌ హైట్స్‌ రిచ్‌మండ్‌లో హైదరాబాద్‌కు చెందిన రాహుల్‌ పండిట్‌ రూ.54.50 లక్షలకు ఫ్లాట్‌ కొనుగోలు చేశారు. 2011లో అడ్వాన్స్‌ సహా రూ.8.17 లక్షలు చెల్లించి, రూ.43.60 లక్షలకు బ్యాంకు నుంచి రుణం పొంది ఒప్పందం చేసుకున్నారు. నిర్మాణం పూర్తయ్యేదాకా ప్రీ ఈఎంఐలు చెల్లించడానికి నిర్మాణదారు అంగీకరించారు. 2016 నుంచి ఈఎంఐ నిలిపివేయడంతోపాటు రూ.5.76 లక్షలు చెల్లించాలంటూ తనకు డిమాండ్‌ నోటీసు పంపారని... పనులు అసంపూర్తిగా ఉన్నాయని రాహుల్‌ రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై  కె.రంగారావు, ఆర్‌.ఎస్‌.రాజశ్రీల ధర్మాసనం     తీర్పు వెలువరించింది. ఫ్లాట్‌ను వెంటనే రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వడంతోపాటు, 2016 నుంచి ప్రీ ఈఎంఐ, పరిహారంగా రూ.లక్ష, ఖర్చుల కింద మరో రూ.20 వేలు చెల్లించాలంటూ ఆదిత్య కన్‌స్ట్రక్షన్స్‌ను ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని