పీవీ జీవితంపై పాఠ్యపుస్తకం తెస్తాం

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతిని పురస్కరించుకుని ఆయనకు పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. పీవీ జీవిత చరిత్ర అందరికీ తెలిసేలా పాఠ్యపుస్తకం తీసుకొస్తామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారు. దిల్లీలో ఆయన పేరిట

Updated : 29 Jun 2022 06:13 IST

 కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

మాజీ ప్రధానికి ఘన నివాళి

ఖైరతాబాద్‌-న్యూస్‌టుడే, ఈనాడు-హైదరాబాద్‌, దిల్లీ: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతిని పురస్కరించుకుని ఆయనకు పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. పీవీ జీవిత చరిత్ర అందరికీ తెలిసేలా పాఠ్యపుస్తకం తీసుకొస్తామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారు. దిల్లీలో ఆయన పేరిట స్మృతి మందిర్‌ ఏర్పాటు చేసి.. ఆయన జ్ఞాపకాలు పదిలంగా ఉండేలా చూస్తామని, ప్రత్యేక తపాలా బిళ్ల విడుదల చేస్తామని వివరించారు. మంగళవారం నెక్లెస్‌ రోడ్డులోని పీవీ ఘాట్‌లో ఆయన నివాళులు అర్పించారు. పీవీ కుటుంబ సభ్యులు ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, రమాదేవి, ప్రభాకర్‌, హైకోర్టు జడ్జి జస్టిస్‌ శ్రావణ్‌, సుభాష్‌ పాల్గొన్నారు.

* శాసనసభ ప్రాంగణంలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డిలు, నెక్లెస్‌ రోడ్డులోని పీవీ విగ్రహానికి మంత్రులు నిరంజన్‌రెడ్డి, మంత్రి తలసాని, మహమూద్‌ అలీ, మల్లారెడ్డి, తదితరులు పీవీ ఘాట్‌లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నివాళి అర్పించారు. ఆయనకు నివాళులు అర్పించేందుకు సీఎం కేసీఆర్‌ రెండు నిమిషాలు కేటాయించలేకపోయారని సంజయ్‌ విమర్శించారు. పీవీ శతజయంతి ఉత్సవాలు పూర్తయి ఏడాదైనా ఆయన స్వగ్రామమైన హనుమకొండ జిల్లా వంగరలో రూ.15 కోట్లతో ప్రభుత్వం చేపడతామన్న పనుల్లో ఏవీ పూర్తి కాలేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ట్విటర్‌లో పేర్కొన్నారు. దిల్లీలోని తెలంగాణ భవన్‌లో మంగళవారం పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కె.ఎం.సాహ్ని, తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ పాల్గొన్నారు. ఆయన సేవలను రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ సీఎంలు అశోక్‌ గహ్లోత్‌, భూపేశ్‌ భగేల్‌, కాంగ్రెస్‌ నేతలు శశి థరూర్‌, ఎం.పల్లంరాజు స్మరించుకున్నారు. పీవీ గొప్ప మేధావి, పండితుడని ప్రధాని మోదీ ట్విటర్‌లో కొనియాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని