Veena and Vani: ఇంటర్‌ ఫలితాల్లో వీణా-వాణిలకు ఫస్ట్‌ క్లాస్‌

అవిభక్త కవలలు వీణా-వాణి ఇంటర్‌ ఫలితాల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై ప్రతిభ చాటారు. మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడెం గ్రామానికి చెందిన వీణా-వాణి మారగాని మురళి, నాగలక్ష్మి దంపతుల కుమార్తెలు. వారు 2003

Updated : 29 Jun 2022 07:09 IST

దంతాలపల్లి, వెంగళ్‌రావునగర్‌, న్యూస్‌టుడే:  అవిభక్త కవలలు వీణా-వాణి ఇంటర్‌ ఫలితాల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై ప్రతిభ చాటారు. మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడెం గ్రామానికి చెందిన వీణా-వాణి మారగాని మురళి, నాగలక్ష్మి దంపతుల కుమార్తెలు. వారు 2003 అక్టోబరు 16న తలలు అతుక్కుని జన్మించారు. ప్రస్తుతం హైదరాబాద్‌ వెంగళ్‌రావునగర్‌లోని మహిళ, శిశు సంక్షేమశాఖ కమిషనరేట్‌ ఆవరణలోని బాలసదన్‌లో ఆశ్రయం పొందుతూ ఇంటర్‌ పూర్తి చేశారు. ప్రభుత్వం వారికి అక్కడే శిక్షణకు తగిన ఏర్పాట్లు చేసింది. విద్యాశాఖ ప్రత్యేక అనుమతితో బాలసదన్‌లోనే పరీక్షలు రాశారు. సీఈసీ గ్రూప్‌తో చదివిన వీణ 712, వాణి 707 మార్కులు సాధించినట్లు తల్లిదండ్రులు మంగళవారం ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. వీరికి రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ బాలసదన్‌కు చేరుకొని వారికి మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని