రాష్ట్రాలకు పరిహారం కొనసాగింపుపై నేడు నిర్ణయం

రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లింపుపై నేడు జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రాలకు కేంద్రం అందజేస్తున్న పరిహారం గడువు గురువారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ అంశంపై

Published : 29 Jun 2022 04:24 IST

చేనేతపై జీఎస్టీ పూర్తిగా తొలగించాలని కోరిన రాష్ట్రం 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లింపుపై నేడు జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రాలకు కేంద్రం అందజేస్తున్న పరిహారం గడువు గురువారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ అంశంపై మంగళవారం నుంచి చండీగఢ్‌లో జరుగుతున్న జీఎస్టీ మండలి సమావేశంలో చర్చించి పరిహారం కొనసాగించాలా లేక ముగించాలా అనే విషయాన్ని ఖరారు చేయనున్నారు. జీఎస్టీ పరిహారాన్ని మరో రెండేళ్లపాటు కొనసాగించాలని రాష్ట్రాలు జీఎస్టీ మండలికి విన్నవించాయి. కేంద్రం మాత్రం దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలో మంగళవారం చండీగఢ్‌లో జీఎస్టీ మండలి సమావేశమైంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఆధ్యక్షతన జరిగిన సమావేశంలో వివిధ రాష్ట్రాల మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ తరఫున ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు, శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి కె.రామకృష్ణారావు, వాణిజ్యపన్నులశాఖ కమిషనర్‌ నీతూకుమార్‌ ప్రసాద్‌, అధికారులు హాజరయ్యారు. చేనేతపై జీఎస్టీని పూర్తిగా తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం జీఎస్టీ మండలికి నివేదించింది. జీఎస్టీ పరిహారం కొనసాగింపు, ఐజీఎస్టీ సర్దుబాటు, రాష్ట్రానికి రావాల్సిన ఐజీఎస్టీ బకాయిలు ఇవ్వాలని కోరింది. అయిదేళ్లలో జీఎస్టీ అమలు, ఎదురైన సవాళ్లు, కరోనా నేపథ్యంలో రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలపై జీఎస్టీ రాబడుల ప్రభావం తదితర అంశాలపై తొలిరోజు సమావేశంలో చర్చించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని