Published : 29 Jun 2022 04:24 IST

మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: తన ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించాలని కోరుతూ తెరాస మంత్రి కొప్పుల ఈశ్వర్‌ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను మంగళవారం హైకోర్టు కొట్టివేసింది. ధర్మపురి నియోజకవర్గం నుంచి అక్రమ పద్ధతుల్లో గెలిచిన కొప్పుల ఈశ్వర్‌ ఎన్నిక చెల్లదని ప్రకటించాలని, ఆ స్థానంలో తనను ఎమ్మెల్యేగా ప్రకటించాలని కోరుతూ ఎన్నికల్లో ఓటమిపాలైన కాంగ్రెస్‌ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ 2018లో ఎన్నికల పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను తిరస్కరించాలంటూ కొప్పుల ఈశ్వర్‌ మధ్యంతర పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారించిన జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ఉత్తర్వులు జారీ చేస్తూ కొప్పుల ఈశ్వర్‌ పిటిషన్‌ను కొట్టివేశారు. లక్ష్మణ్‌కుమార్‌ ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల పిటిషన్‌పై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాల్సి ఉందని న్యాయమూర్తి పేర్కొన్నారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని