గ్రామకంఠం భూముల సర్వేకు సిద్ధంకండి

తెలంగాణ రాష్ట్ర పరిధి గ్రామీణ ప్రాంతాల్లోని ఆబాది గ్రామకంఠం భూముల సమగ్ర సర్వేకు సిద్ధం కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా అధికారులను ఆదేశించారు. ఈ భూముల

Published : 29 Jun 2022 05:20 IST

అధికారులకు సర్కారు ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పరిధి గ్రామీణ ప్రాంతాల్లోని ఆబాది గ్రామకంఠం భూముల సమగ్ర సర్వేకు సిద్ధం కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా అధికారులను ఆదేశించారు. ఈ భూముల సమగ్ర సర్వేకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో మార్గదర్శకాల మేరకు అవసరమైన ముందస్తు కార్యాచరణను పూర్తిచేయాలని ఆయన సూచించారు. మంగళవారం పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్‌ హనుమంతరావు, డిప్యూటీ కమిషనర్లు జాన్‌ వెస్లీ, రవీందర్‌, రామారావులతో పాటు వివిధ జిల్లాల పంచాయతీ అధికారులు, సర్వే ఆఫ్‌ ఇండియా అధికారులతో సందీప్‌కుమార్‌ సుల్తానియా ప్రత్యేకంగా సమావేశమయ్యారు.  గ్రామకంఠం భూముల సర్వే విధివిధానాలపై చర్చించారు. సర్వేకు అవసరమైన పరికరాలు, డ్రోన్లు, గ్రామపటాలు తదితరాలను గుర్తించాలన్నారు. కార్యాచరణపై సమగ్ర నివేదికను అందించాలని ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని