Updated : 29 Jun 2022 06:53 IST

Weather Forecast: చురుగ్గా రుతుపవనాల కదలిక.. తెలంగాణలో నేడు భారీ వర్షాలు

ఈనాడు, హైదరాబాద్‌: మధ్యప్రదేశ్‌ నుంచి ఒడిశా మీదుగా బంగాళాఖాతం వరకు 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితలద్రోణి ఉంది. తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో బుధవారం రాష్ట్రంలోని పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం ఉదయం 8  నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు పలుచోట్ల భారీవర్షాలు కురిశాయి. అత్యధికంగా అశ్వాపురం(భద్రాద్రి జిల్లా)లో 10 సెంటీమీటర్లు, జూలూరుపాడులో 8.5, మంచిప్ప(నిజామాబాద్‌)లో 6.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మంగళవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు పలుచోట్ల వర్షాలు కురిశాయి. అత్యధికంగా సంగారెడ్డిలో 6.4 సెం.మీ, గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని నేరెడ్‌మెట్‌లో 5.4, అల్వాల్‌ కొత్తబస్తీ 5.3, కంది 5, మహేశ్‌నగర్‌లో 4.4 సెం.మీ.వర్షం కురిసింది.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts