విత్తనాలు విత్తే దమ్ముంది.. పిచికారీ చేసే డ్రమ్ముంది..!

ఏక కాలంలో భూమిలో విత్తనాలు నాటి, ఎరువు వేసి, కలుపు నివారణ మందు పిచికారీ చేసేందుకు జైనథ్‌ మండలం బెల్గాం గ్రామానికి చెందిన రైతు కటకం ప్రమోద్‌ చక్కని ఆలోచన చేశారు. ఇప్పటికే విత్తనం, ఎరువు ఒకే సారి వేయడానికి

Published : 29 Jun 2022 05:15 IST

ఏక కాలంలో భూమిలో విత్తనాలు నాటి, ఎరువు వేసి, కలుపు నివారణ మందు పిచికారీ చేసేందుకు జైనథ్‌ మండలం బెల్గాం గ్రామానికి చెందిన రైతు కటకం ప్రమోద్‌ చక్కని ఆలోచన చేశారు. ఇప్పటికే విత్తనం, ఎరువు ఒకే సారి వేయడానికి వీలుగా ఆధునిక యంత్రం అందుబాటులోకి వచ్చింది. దానికే కలుపు నివారణ మందు కూడా పిచికారీ చేసేలా తలచి కార్యాచరణలోకి దిగారు. విత్తే యంత్రానికి ముందు భాగంలో కలుపు నివారణ మందు, నీళ్లు పోసేందుకు వీలుగా డ్రమ్ము ఉంచి దాని నుంచి మందు పంపింగ్‌ చేసేందుకు మోటారును బిగించి, యంత్రానికి వెనుక వైపున వరుసగా నాజిల్స్‌ ఏర్పాటు చేశారు. దీంతో ఒకే సమయంలో విత్తనంతో పాటు ఎరువు వేయడం, కలుపు నివారణ మందు పిచికారీ చేయడం పూర్తవుతోంది. ఇందుకోసం రూ.18 వేలు ఖర్చయ్యాయని, ఈ యంత్రంతో ఒక రోజులో 30 ఎకరాల్లో విత్తనం, ఎరువు, కలుపు నివారణ మందు ఒకేసారి పిచికారీ చేయవచ్చని ప్రమోద్‌ తెలిపారు. దీన్ని చూసిన ఇతర రైతులు అద్దెకు తీసుకెళ్తున్నారని ఆయన వివరించారు. దీనిపై ఆదిలాబాద్‌ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతు ఆలోచన చాలా ఉపయుక్తంగా ఉందన్నారు.

  - న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ వ్యవసాయం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని