‘వానాకాలం వెళ్లే వరకూ పదోన్నతులు అడగొద్దు’

వానాకాలం ముగిసే వరకూ నీటిపారుదల శాఖకు చెందిన ఏఈలు, ఏఈఈలు పదోన్నతులు, బదిలీలంటూ హైదరాబాద్‌లోని నీటిపారుదల శాఖ కార్యాలయానికి రావద్దని నీటిపారుదల శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు

Published : 29 Jun 2022 05:15 IST

ఈనాడు, హైదరాబాద్‌: వానాకాలం ముగిసే వరకూ నీటిపారుదల శాఖకు చెందిన ఏఈలు, ఏఈఈలు పదోన్నతులు, బదిలీలంటూ హైదరాబాద్‌లోని నీటిపారుదల శాఖ కార్యాలయానికి రావద్దని నీటిపారుదల శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ఈఎన్‌సీ(పరిపాలన) అనిల్‌కుమార్‌ శాఖ అంతర్గత ఉత్తర్వులు (ఆర్‌సీ/ఈఎన్‌సీ/బీ1) జారీ చేశారు. ఇటీవల కొందరు ఏఈ, ఏఈఈలు పదోన్నతులంటూ తరచూ కార్యాలయానికి వస్తున్నారని, పలువురు ఏఈఈలు మధ్యాహ్న భోజన సమయంలో ధర్నాకు అనుమతి కూడా కోరారని పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ఆనకట్టలతో పాటు మధ్యతరహా ప్రాజెక్టుల డ్యాంల పరిరక్షణకు తగిన చర్యలు చేపట్టాలని నీటిపారుదలశాఖ ఆదేశించింది. ఇటీవల కేంద్ర ఉత్తర్వుల మేరకు కొత్తగా అమల్లోకి వచ్చిన ఆనకట్టల పరిరక్షణ కమిటీ, చట్టం అమలుపై ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ మంగళవారం సీఈలతో వీడియో కాన్ఫ్‌రెన్స్‌ ద్వారా మాట్లాడి పలు సూచనలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని