- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
ఎసైన్డ్దారులకే భూముల అప్పగింత..!
జమునా హేచరీస్ ఆక్రమణలో 85.19 ఎకరాలు
రెవెన్యూ యంత్రాంగం విచారణలో నిర్ధారణ
65 మందికి తిరిగి అప్పగించేందుకు కార్యాచరణ
ఈనాడు, హైదరాబాద్: మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేటలలోని వివాదాస్పద ఎసైన్డ్ భూముల వ్యవహారం కీలక మలుపు తిరిగింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తోపాటు ఆయన అనుచరులు ఈ ఎసైన్డ్ భూములను ఆక్రమించుకొన్నారనే ఆరోపణల నేపథ్యంలో రెవెన్యూ అధికారులు కొంతకాలంగా విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విచారణ కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఆ భూములను తిరిగి ఎసైన్డ్దారులకే ఇచ్చేందుకు రెవెన్యూ యంత్రాంగం సమాయత్తమవుతోంది. తెలంగాణ ఎసైన్డ్ భూముల(బదలాయింపు నిషేధం) చట్టం 1977 కింద విచారణ జరిపిన రెవెన్యూ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండు గ్రామాల్లోని 65 మంది ఎసైన్డ్‌దారులకు లేదా వారి వారసులకు ఈ భూములపై హక్కులు కల్పించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.
ఇంతకీ వివాదం ఏమిటంటే..: తమ భూములు ఆక్రమణకు గురయ్యాయని లింగయ్యతోపాటు మరికొందరు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. 1994లో తమకు ప్రభుత్వం కేటాయించిన సీలింగ్ భూముల్ని ఈటల రాజేందర్‌తోపాటు ఆయన అనుచరులు దౌర్జన్యంగా ఆక్రమించారనేది ఫిర్యాదు సారాంశం. ఆ భూముల్లో జమునా హేచరీస్‌కు చెందిన పౌల్ట్రీ షెడ్లు నిర్మించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై రెవెన్యూ అధికారులు విచారణకు సిద్ధమవగా జమునా హేచరీస్ యాజమాన్యం హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేసింది. యంత్రాంగం నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవచ్చని హైకోర్టు ఆదేశిస్తూ ఆ పిటిషన్లను నిలుపుదల చేసింది. ఆ వివాదంపై రెవెన్యూ అధికారులు విచారణ జరిపారు.
రెండు గ్రామాల్లోని 65 మంది ఎసైన్డ్‌దారులకు చెందిన 85 ఎకరాల 19 గుంటల భూమి ఆక్రమణకు గురైనట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఈ భూముల్ని నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చుతూ 2007 డిసెంబరు 17నే అప్పటి ప్రభుత్వం మెమో జారీ చేసినట్లు గుర్తించారు. మరోవైపు అప్పటి ఎసైన్డ్దారుల్లో 53 మంది బీసీలు, 9 మంది ఎస్సీలు, ముగ్గురు ఎస్టీలున్నట్లు వెల్లడైంది. ఈక్రమంలో వీరికే భూముల్ని తిరిగి అప్పగించాలని నిర్ణయించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Liger: పూరీ ఆలోచనల్లో అనన్య లేదు.. ‘లైగర్’ భామ ఆమె కాదు..!
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Ts-top-news News
TS High Court: ఆ భూమి రామానాయుడు కుటుంబానిదే.. తీర్పు వెలువరించిన హైకోర్టు
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (18/08/2022)
-
Viral-videos News
Viral video: యూనిఫాంలో పోలీసుల ‘నాగిని డ్యాన్స్’.. వైరల్‌గా మారిన వీడియో
-
World News
Kabul: కాబుల్ మసీదులో భారీ పేలుడు.. భారీగా ప్రాణనష్టం?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Liger: లైగర్ ఓటీటీ ఆఫర్ ఎందుకు వదులుకున్నారు?
- DK : ఆయన ఓటమిని అస్సలు తట్టుకోలేడు.. సహనం తక్కువే.. కానీ!
- అజిత్ డోభాల్ ఇంటి వద్ద వ్యక్తి హల్చల్ ఘటన.. ముగ్గురు కమాండోలపై వేటు
- Vizag: విశాఖలో రౌడీషీటర్ హత్య.. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఘాతుకం
- Vinod kambli: బీసీసీఐ పింఛనే నాకు దిక్కు.. సచిన్ నుంచి ఏమీ ఆశించట్లేదు: వినోద్ కాంబ్లి
- Andhra News: వివాహితను భయపెట్టి నగ్న వీడియో కాల్..
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (18/08/2022)
- డేంజర్ జోన్లో రాష్ట్ర ప్రభుత్వం
- Kabul: కాబుల్ మసీదులో భారీ పేలుడు.. భారీగా ప్రాణనష్టం?
- Viral video: యూనిఫాంలో పోలీసుల ‘నాగిని డ్యాన్స్’.. వైరల్‌గా మారిన వీడియో