వీణ, వాణిలకు సీఏలో ఉచితంగా శిక్షణ

ఇంటర్‌ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన అవిభక్త కవలలు వీణ, వాణిలను రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిలు బుధవారం కలిసి మిఠాయిలు తినిపించారు. వెంగళరావునగర్‌ మహిళాభివృద్ధి

Published : 30 Jun 2022 03:42 IST

మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌

వెంగళ్‌రావునగర్‌, న్యూస్‌టుడే: ఇంటర్‌ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన అవిభక్త కవలలు వీణ, వాణిలను రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిలు బుధవారం కలిసి మిఠాయిలు తినిపించారు. వెంగళరావునగర్‌ మహిళాభివృద్ధి శిశుసంక్షేమ శాఖ కమిషనరేట్‌లో ఉన్న బాలసదన్‌లో ఆశ్రయం పొందుతున్న వీరికి మంత్రులు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ వీణ, వాణిలు కొవిడ్‌ సమయంలో కూడా ఆన్‌లైన్‌ తరగతుల్లో పాల్గొన్నారన్నారు. ఆ సమయంలో వీరికి తల్లి అవసరం ఉన్నందున ఆమెకు కూడా ఇక్కడే ఉద్యోగం ఇచ్చామని తెలిపారు. బాలసదన్‌లో ఉండే మిగతా పిల్లలు కూడా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ వీణ, వాణిలు సీఏ కోర్సు చేయడానికి ఆసక్తి చూపుతున్నారని, శ్రీమేధలో వారికి ఉచితంగా శిక్షణ అందిస్తామన్నారు. గురుకులాల్లో చదివిన చాలామంది విద్యార్థులు ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యారని తెలిపారు. వీణ, వాణిలకు దేవుడు అన్యాయం చేసినా ముఖ్యమంత్రి కేసీఆర్‌, రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచినట్లు పేర్కొన్నారు. ఇంటర్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేదని విద్యార్థులెవరూ తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని ఆమె పేర్కొన్నారు. అలాంటి విద్యార్థులు ఏడాది నష్టపోకుండా ఉండేందుకు అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ పరీక్ష ఉంటుందన్నారు. ఎమ్మెల్సీ టి.రవీందర్‌రావు, శిశు సంక్షేమ శాఖ సంయుక్త డైరెక్టర్లు కేఎస్‌ఆర్‌.లక్ష్మీదేవి, సునంద, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని