నిల్చునే ఓపిక లేక.. వరసలో రాయి, సీసా..!

వర్షాలు ప్రారంభమవడంతో యూరియా కోసం రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రానికి 140 మెట్రిక్‌ టన్నుల యూరియా వచ్చిందని తెలియడంతో బుధవారం రైతులు సొసైటీ కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

Published : 30 Jun 2022 03:42 IST

వర్షాలు ప్రారంభమవడంతో యూరియా కోసం రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రానికి 140 మెట్రిక్‌ టన్నుల యూరియా వచ్చిందని తెలియడంతో బుధవారం రైతులు సొసైటీ కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 6 గంటలకే కార్యాలయం వద్దకు చేరుకుని ఆరుబయట చెప్పులు, రాళ్లు, కల్లు సీసాలను వరుసలో పెట్టారు. గంటల తరబడి నిలబడే ఓపిక లేక వరుసలో వీటిని పెట్టినట్లు అన్నదాతలు తెలిపారు. కాగా కార్యాలయానికి వచ్చిన ఎనిమిది వందల మందికి యూరియా బస్తాలు అందించినట్లు, ఇంకా సరకు మిగిలి ఉందని అధికారులు పేర్కొన్నారు.

- న్యూస్‌టుడే, లింగంపేట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని