ఆ విద్యార్థికి సున్నా కాదు.. ఒక మార్కు వచ్చింది: ఇంటర్‌ బోర్డు

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం సంస్కృతంలో మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన హరికిరణ్‌ అనే విద్యార్థికి సున్నా మార్కులు వచ్చినట్లు మెమోలో చూపిన ఇంటర్‌బోర్డు.. ఆ విద్యార్థికి ఒక మార్కు వచ్చిందని బుధవారం తెలిపింది. ఇంటర్మీడియట్‌

Published : 30 Jun 2022 06:24 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం సంస్కృతంలో మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన హరికిరణ్‌ అనే విద్యార్థికి సున్నా మార్కులు వచ్చినట్లు మెమోలో చూపిన ఇంటర్‌బోర్డు.. ఆ విద్యార్థికి ఒక మార్కు వచ్చిందని బుధవారం తెలిపింది. ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రకటించిన ఫలితాల్లో తప్పులు దొర్లాయంటూ ‘‘ఇంటర్‌ ఫలితాల్లో మళ్లీ తప్పులు’’ శీర్షికన ‘ఈనాడు’లో బుధవారం కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఇంటర్‌బోర్డు ఆ విద్యార్థి జవాబు పత్రాన్ని బుధవారం సబ్జెక్టు నిపుణుడితో పునఃపరిశీలన చేయించింది. అంతకు ముందు ఎగ్జామినర్‌ ఆ విద్యార్థి జవాబు పత్రానికి సున్నా వేశారని, తాజా ఎగ్జామినర్‌ మాత్రం ఒక మార్కు ఇచ్చారని బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు