- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
ISRO: నేటి సాయంత్రం నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సి53
కొనసాగుతున్న కౌంట్‌డౌన్
శ్రీహరికోట, న్యూస్‌టుడే: తిరుపతి జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) రెండో ప్రయోగ వేదిక నుంచి గురువారం సాయంత్రం 6.02 గంటలకు పీఎస్‌ఎల్వీ-సి53 నింగిలోకి దూసుకెళ్లనుంది. రాకెట్ సన్నద్ధత, లాంచ్ ఆథరైజేషన్ సమావేశాల అనంతరం ప్రయోగానికి పచ్చజెండా ఊపారు. ముందుగా నిర్దేశించిన సమయంలో అంతరిక్ష వ్యర్థాలు అడ్డు వస్తున్నాయని గుర్తించి రెండు నిమిషాలు ఆలస్యంగా రాకెట్ ప్రయోగించనున్నారు. ఇందుకు అవసరమైన కౌంట్‌డౌన్ ప్రక్రియ బుధవారం సాయంత్రం 4.02 గంటలకు ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా 26 గంటల పాటు కొనసాగిన పిదప వాహకనౌక నింగిలోకి పయనించనుంది. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్(ఎన్‌ఎస్‌ఐఎల్) వాణిజ్య పరమైన రెండో మిషన్ ఇది. సింగపూర్, కొరియాకు చెందిన మూడు ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టనుంది. డీఎస్-ఈవో ఉపగ్రహం బరువు 365 కిలోలు. ఇది 0.5 మీటర్ల రిజల్యూషన్ ఇమేజింగ్ సామర్థ్యంతో ఎలక్ట్రో ఆప్టిక్, మల్టీ-స్పెక్ట్రల్ పేలోడ్‌ను కలిగి ఉంది. ఎన్‌ఇయూఎస్‌ఏఆర్ అనేది ఎస్‌ఏఆర్ పేలోడ్‌ను మోసుకెళ్లే సింగపూర్‌కు చెందిన మొట్టమొదటి బుల్లి వాణిజ్య ఉపగ్రహం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Andhra news: రోజూ ఏదో ఒక కుట్ర: తెదేపాపై కొడాలి నాని ఫైర్
-
General News
Andhra News: ఏపీ ప్రభుత్వం మరో రూ.వెయ్యి కోట్ల అప్పు
-
India News
Maharashtra: సముద్రతీరంలో ఆయుధాలతో పడవ గుర్తింపు.. హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు
-
Movies News
Liger: ‘లైగర్’ సినిమా.. ఏడు అభ్యంతరాలు చెప్పిన సెన్సార్ బోర్డ్
-
World News
Ukraine: రహస్యంగా ‘ఆపరేషన్ క్రిమియా’
-
General News
Gorantla Madhav: ప్రైవేటు ఫొరెన్సిక్ ల్యాబ్ ఎలా ప్రామాణికం?: ఏపీ సీఐడీ చీఫ్ సునీల్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Vinod kambli: బీసీసీఐ పింఛనే నాకు దిక్కు.. సచిన్ నుంచి ఏమీ ఆశించట్లేదు: వినోద్ కాంబ్లి
- DK : ఆయన ఓటమిని అస్సలు తట్టుకోలేడు.. సహనం తక్కువే.. కానీ!
- Liger: లైగర్ ఓటీటీ ఆఫర్ ఎందుకు వదులుకున్నారు?
- Andhra News: వివాహితను భయపెట్టి నగ్న వీడియో కాల్..
- అజిత్ డోభాల్ ఇంటి వద్ద వ్యక్తి హల్చల్ ఘటన.. ముగ్గురు కమాండోలపై వేటు
- Vizag: విశాఖలో రౌడీషీటర్ హత్య.. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఘాతుకం
- Madhavan: ‘రాకెట్రీ.. మాధవన్ ఇంటిని కోల్పోయాడు’
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (18/08/2022)
- Viral video: యూనిఫాంలో పోలీసుల ‘నాగిని డ్యాన్స్’.. వైరల్‌గా మారిన వీడియో
- Kabul: కాబుల్ మసీదులో భారీ పేలుడు.. భారీగా ప్రాణనష్టం?