అదనపు వైద్యవిద్య సంచాలకులకూ 65 ఏళ్లకు పదవీ విరమణ

ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రధానాచార్యులు, బోధనాసుపత్రుల్లో సూపరింటెండెంట్లు, అదనపు వైద్య విద్య సంచాలకులుగా పనిచేస్తున్న ఉన్నతాధికారులందరికీ పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచుతూ

Published : 01 Jul 2022 06:05 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రధానాచార్యులు, బోధనాసుపత్రుల్లో సూపరింటెండెంట్లు, అదనపు వైద్య విద్య సంచాలకులుగా పనిచేస్తున్న ఉన్నతాధికారులందరికీ పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వైద్యవిద్యలో ఆచార్యులకు పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వ వైద్యకళాశాలలు, బోధనాసుపత్రుల్లో అత్యధిక సందర్భాల్లో ఆచార్యులే.. సూపరింటెండెంట్లుగా, ప్రధానాచార్యులుగా పనిచేస్తున్నారు. అందుకే ఆయా స్థానాల్లో సేవలందిస్తున్న వారికి కూడా 65 ఏళ్ల వరకూ పదవీ విరమణ వయసును పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వైద్యశాఖ కార్యదర్శి రిజ్వీ ఉత్తర్వుల్లో ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని