ఆర్జీయూకేటీలో ప్రవేశాలకు ప్రకటన విడుదల

గ్రామీణ విద్యార్థులకు అత్యుత్తమ సాంకేతిక విద్యనందించే నిర్మల్‌ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీలో ప్రవేశాలకు గురువారం డైరెక్టర్‌ సతీష్‌కుమార్‌ ప్రకటన (నోటిఫికేషన్‌) విడుదల చేశారు. 2022-23 విద్యాసంవత్సరానికి 1,500 సీట్ల భర్తీకి ఎంపిక ప్రక్రియ

Published : 01 Jul 2022 06:05 IST

ముథోల్‌, న్యూస్‌టుడే: గ్రామీణ విద్యార్థులకు అత్యుత్తమ సాంకేతిక విద్యనందించే నిర్మల్‌ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీలో ప్రవేశాలకు గురువారం డైరెక్టర్‌ సతీష్‌కుమార్‌ ప్రకటన (నోటిఫికేషన్‌) విడుదల చేశారు. 2022-23 విద్యాసంవత్సరానికి 1,500 సీట్ల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుకు సంబంధించి విద్యార్థులు జులై 1 నుంచి ఆన్‌లైన్‌ ప్రక్రియ (టీఎస్‌ ఆన్‌లైన్‌ సర్వీస్‌ సెంటర్స్‌) ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వీటి సమర్పణకు చివరి తేదీ జులైౖ 15గా నిర్ణయించారు. పీహెచ్‌సీ, సీఏపీ, ఎన్‌సీసీ విద్యార్థులు దరఖాస్తు చేసుకున్న ప్రతితోపాటు మిగతా ధ్రువపత్రాల నకళ్లను జులై 19 లోగా విద్యాలయానికి పంపాలని ప్రకటనలో పేర్కొన్నారు. మిగతా విద్యార్థులు పంపాల్సిన అవసరం లేదు. ఎంపికైన విద్యార్థుల జాబితాను జులైౖ 30న ప్రకటిస్తామని అందులో వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని