Updated : 01 Jul 2022 06:27 IST

ఇంటర్‌లోనూ ఈడబ్ల్యూఎస్‌ కోటా

నేటి నుంచి అధికారికంగా ప్రథమ సంవత్సర ప్రవేశాలు

 ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌) కోటాను అమలు చేయనున్నారు. వారికి 10 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని ఇంటర్‌బోర్డు ప్రకటించింది. రాష్ట్రంలో అధికారికంగా ఇంటర్‌మీడియట్‌ ప్రథమ సంవత్సర ప్రవేశాలు శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ఇంటర్‌బోర్డు గురువారం కాలపట్టికను జారీ చేసింది. ఈ నెల 11 నుంచి ఫస్టియర్‌ తరగతులు మొదలుకానుండగా ఆగస్టు 17తో మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ పూర్తవుతుందని ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్‌ తెలిపారు. ప్రైవేట్‌ కళాశాలల్లో జూన్‌ మొదటి వారం నుంచే తరగతులు మొదలుకావడం గమనార్హం. ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలకు ఆధార్‌ సంఖ్య తప్పనిసరని బోర్డు పేర్కొంది.

ఇంప్రూవ్‌మెంట్‌ ఫీజు ఒక్కో పేపర్‌కు రూ.150  

ఇంటర్‌ ప్రథమ సంవత్సరం అన్ని సబ్జెక్టులు పాసైన వారు మార్కులు పెంచుకునేందుకు ఇంప్రూవ్‌మెంట్‌ రాయాలంటే ఒక్కో పేపర్‌కు రూ.150 ఫీజు చెల్లించాలి. సాధారణ పరీక్ష ఫీజు రూ.490కి అవి అదనం. వారికి ఎందులో ఉత్తమ మార్కులు ఉంటే వాటిని పరిగణనలోకి తీసుకుంటారు. సబ్జెక్టులో తప్పినా అంతకుముందువే ఉంటాయి.

నేడు టెట్‌ ఫలితాలు

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ఫలితాలను పాఠశాల విద్యాశాఖ శుక్రవారం ఉదయం 11.30కు విడుదల చేయనుంది. అభ్యర్థులు పేపర్‌-1, 2 ఫలితాలను టీఎస్‌ టెట్‌ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని టెట్‌ కన్వీనర్‌ రాధారెడ్డి గురువారం తెలిపారు. ఫలితాలను www.eenadu.net, eenadupratibha.net,  tstet.cgg.gov.in తదితర వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు.

పాలిసెట్‌కు 91.62 శాతం మంది హాజరు

రాష్ట్రవ్యాప్తంగా గురువారం జరిగిన పాలిసెట్‌-2022కు 91.62 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 1,13,979 మందికి 1,04,432 మంది పరీక్ష రాశారని కన్వీనర్‌ డాక్టర్‌ సి.శ్రీనాథ్‌ తెలిపారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని