అంగరంగ వైభవంగా గోల్కొండ బోనాలు

చారిత్రక గోల్కొండ బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌లో మంత్రులు మహమూద్‌ అలీ, ఇంద్రకరణ్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తొట్టెల, ఫలహారం బండికి పూజలు నిర్వహించడంతో

Published : 01 Jul 2022 06:10 IST

మెహిదీపట్నం, న్యూస్‌టుడే: చారిత్రక గోల్కొండ బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌లో మంత్రులు మహమూద్‌ అలీ, ఇంద్రకరణ్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తొట్టెల, ఫలహారం బండికి పూజలు నిర్వహించడంతో పాటు కల్లు సాక సమర్పించి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. అనంతరం దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జగదాంబిక అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పేలా సాంస్కృతిక బృందాలు, పెద్దఎత్తున భక్త జనం వెంటరాగా పోతరాజులు, యువత తీన్‌మార్‌ నృత్యాలతో అమ్మవారి తొట్టెల ఊరేగింపు గోల్కొండకు బయలుదేరింది. రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన ప్రజలు అమ్మవారి తొట్టెలకు సాకలు పెట్టి, పూజలు నిర్వహించారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ ఎల్‌.రమణ తదితరులు పూజలు నిర్వహించారు. అంతకుముందు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్‌ బోనాల ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు రూ.15 కోట్ల నిధులను కేటాయించారన్నారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండేలా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని