తెరాసకు కౌంట్‌డౌన్‌

తెరాస సర్కారుకు కౌంట్‌డౌన్‌ మొదలైందని, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని భాజపా తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జి తరుణ్‌ఛుగ్‌ అన్నారు. ఈ నెల 3న విజయ సంకల్ప సభ తరువాత 520 రోజుల్లో రాష్ట్రానికి అవినీతి,

Published : 02 Jul 2022 03:28 IST

ప్రజలు బైబై కేసీఆర్‌ అంటున్నారు
భాజపా రాష్ట్ర ఇన్‌ఛార్జి తరుణ్‌ఛుగ్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెరాస సర్కారుకు కౌంట్‌డౌన్‌ మొదలైందని, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని భాజపా తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జి తరుణ్‌ఛుగ్‌ అన్నారు. ఈ నెల 3న విజయ సంకల్ప సభ తరువాత 520 రోజుల్లో రాష్ట్రానికి అవినీతి, కుటుంబ పాలన నుంచి విముక్తి లభిస్తుందన్నారు. దుబ్బాకలో ధమాకా తరువాత హుజూరాబాద్‌లో హుజూర్‌ అహంకారాన్ని ప్రజలు దించేశారన్నారు. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో తరుణ్‌ ఛుగ్‌ విలేకరులతో మాట్లాడారు. ఈ సమావేశాల్లో మహారాష్ట్ర, తెలంగాణ రాజకీయాలు, త్వరలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు.. అనుసరించాల్సిన వ్యూహాలపై నిర్ణయాలు ఉంటాయని వివరించారు.

కవిత, కేటీఆర్‌, హరీశ్‌ ఉద్యమంలో లేరు

‘రాష్ట్రంలో ప్రభుత్వాన్ని సీఎం కుమార్తె కవిత, కుమారుడు కేటీఆర్‌, అల్లుడు హరీశ్‌రావు నడిపిస్తున్నారు. వీరెవరూ తెలంగాణ ఉద్యమంలో లేరు. తెరాస పనితీరు నచ్చక ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యులు భాజపాలో చేరారు. తెరాసకు రోజులు దగ్గర పడ్డాయి. భాజపా కార్యాలయాల్లో బైబై కేసీఆర్‌ కౌంట్‌డౌన్‌ గడియారాలు పెట్టాం. దీంతో ప్రభుత్వం వణుకుతోంది. కౌంట్‌డౌన్‌ను ట్విటర్‌లోనూ పెడతాం.’

నియోజకవర్గాల వారీగా నివేదికలు...

‘రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో రెండు రోజుల పాటు పార్టీ సీనియర్‌ ప్రతినిధులు పర్యటించి నివేదికలిస్తారు. హైదరాబాద్‌లోని వివిధ రాష్ట్రాలకు చెందిన 14 సమాజాలతో సమావేశాలు నిర్వహిస్తున్నాం. తెలంగాణ ప్రజలు మోదీ, భాజపా పట్ల ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు. ముగ్గురు భాజపా కార్పొరేటర్లు తమ గూటికి చేరారని తెరాస నాయకులు అంటున్నారు. ఆ పార్టీ నుంచి పెద్ద నాయకులు, మంత్రి పదవులను కాదని భాజపాలో చేరారు. రెండు మూడు రోజుల్లో మరిన్ని విషయాలు తెలుస్తాయి’ అని తరుణ్‌ఛుగ్‌ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు