రైతులకే ‘పన్ను’ కడుతున్న సీఎం కేసీఆర్‌

వైద్య వ్యవస్థను బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి సిద్దిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో

Published : 02 Jul 2022 06:36 IST

మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట టౌన్‌, చిన్నకోడూరు-న్యూస్‌టుడే: వైద్య వ్యవస్థను బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి సిద్దిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో తెలంగాణ పబ్లిక్‌ హెల్త్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పలువురు వైద్యులను సన్మానించి కేక్‌ కోశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేస్తే వైద్య రంగంలో అద్భుతాలు సాధించొచ్చన్నారు. అంతకుముందు చిన్నకోడూరు మండలంలోని వివిధ గ్రామాల్లో మాట్లాడుతూ దేశంలోని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు భూమిశిస్తు, నీటి తీరువా తదితరాల పేరిట రైతుల నుంచి పన్నులు వసూలు చేస్తుంటే.. రైతులకే ‘పన్ను’ కడుతున్న ఏకైక సీఎంగా కేసీఆర్‌ ఘనత సాధించారని కొనియాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని