తోటలందు ‘ఈ’త తోట వేరయా!

 తోటలు అనగానే ఎవరికైనా గుర్తుకొచ్చేది కూరగాయలు, పండ్ల, పూల తోటలే కానీ.. ఇది ఈత తోట. అదీ రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఉంది. హైదరాబాద్‌లోని పాత బోయినపల్లికి చెందిన మామిడి మహేందర్‌రెడ్డి తనకున్న ఏడెకరాల్లో

Updated : 02 Jul 2022 07:08 IST

ఈనాడు, హైదరాబాద్‌: తోటలు అనగానే ఎవరికైనా గుర్తుకొచ్చేది కూరగాయలు, పండ్ల, పూల తోటలే కానీ.. ఇది ఈత తోట. అదీ రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఉంది. హైదరాబాద్‌లోని పాత బోయినపల్లికి చెందిన మామిడి మహేందర్‌రెడ్డి తనకున్న ఏడెకరాల్లో మొదట్లో సాధారణ పంటలు సాగుచేసేవారు. భూగర్భ జలాలు తగ్గిపోవడంతో ఆ పంటల సాగును కొన్నేళ్ల కిందటే ఆపివేశారు. తెలంగాణ ప్రభుత్వం నీరాను ప్రోత్సహించడం, ఈత తోటలకు నీటి అవసరం ఎక్కువగా ఉండదని తెలుసుకుని ఆ దిశగా అడుగేశారు. రెండేళ్ల కిందట సంగారెడ్డి నుంచి ఈత,  కడియం నుంచి జీలుగు, ఖర్జూర మొక్కలు తెప్పించి  ఏడెకరాల్లో వేశారు. ఇందుకోసం రూ.15 లక్షలు ఖర్చు చేశారు. తోటను ఎప్పుడూ సీసీ కెమెరాల సాయంతో పర్యవేక్షిస్తారు.    

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని