సముద్ర జలాల శుద్ధిపై ‘నెల్లూరు’ యువకుడికి మూడు పేటెంట్‌లు

నెల్లూరు జిల్లా గుడ్లూరు మండల కేంద్రానికి చెందిన డా.సూరపరాజు సుబ్బరామ కౌశిక్‌ అనే యువకుడు సముద్రపు జలాలను శుద్ధి చేయడంపై 3 పేటెంట్‌లను పొందారు. పుదుచ్చేరి

Published : 02 Jul 2022 06:34 IST

గుడ్లూరు, న్యూస్‌టుడే: నెల్లూరు జిల్లా గుడ్లూరు మండల కేంద్రానికి చెందిన డా.సూరపరాజు సుబ్బరామ కౌశిక్‌ అనే యువకుడు సముద్రపు జలాలను శుద్ధి చేయడంపై 3 పేటెంట్‌లను పొందారు. పుదుచ్చేరి వర్సిటీనుంచి పీహెచ్‌డీ పట్టా పొందిన సుబ్బరామ కౌశిక్‌ తయారు చేసిన సముద్రపు నీటిని తాగునీటిగా మార్చే పరికరానికి భారత ప్రభుత్వం పేటెంట్‌ హక్కులు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ విషయాన్ని కౌశిక్‌ శుక్రవారం తెలిపారు. సముద్రపు జలాలను తాగునీటిగా మార్చే ప్రక్రియలో వృక్ష సంబంధ పీచు పదార్థాలను ఉపయోగించినట్లు వివరించారు. దీంతోపాటు మైనం, సముద్రపు ఇసుక ఉపయోగించి నీటిని శుద్ధిచేసే మరో రెండు ప్రక్రియలకు కూడా పేటెంట్‌ లభించిందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని