రహదారికి పచ్చని తోరణాలు.. !

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరిత హారం సత్ఫలితాలనిస్తోంది. 2016లో రెండోవిడత హరిత హారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నల్గొండ జిల్లా చిట్యాల

Published : 02 Jul 2022 06:34 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరిత హారం సత్ఫలితాలనిస్తోంది. 2016లో రెండోవిడత హరిత హారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో ప్రారంభించారు. సిబ్బంది హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారికి ఇరువైపులా రెండు వరుసలుగా సుమారు 163 కిలోమీటర్ల పొడవునా మొక్కలు నాటారు. అటవీశాఖ సహాయంతో స్థానిక సంస్థల రక్షణలో చెట్లుగా ఎదిగిన మొక్కలు నేడు రహదారికి రెండువైపులా పచ్చటి తోరణాలుగా కనిపిస్తున్నాయి. పై చిత్రం హైదరాబాద్‌ శివారున యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ వద్ద తీసినవి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని