బాబ్లీ గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) ఎగువన మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా ధర్మాబాద్‌ సమీపంలో గోదావరిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను శుక్రవారం రెండు రాష్ట్రాల అధికారులు తెరిచారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మహారాష్ట్ర

Published : 02 Jul 2022 06:34 IST

ముథోల్‌, న్యూస్‌టుడే: శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) ఎగువన మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా ధర్మాబాద్‌ సమీపంలో గోదావరిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను శుక్రవారం రెండు రాష్ట్రాల అధికారులు తెరిచారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మహారాష్ట్ర ప్రభుత్వం ఏటా జులై 1న గేట్లు ఎత్తి అక్టోబరు 28 వరకు నదీ ప్రవాహానికి ఆటంకం లేకుండా ప్రాజెక్టు గేట్లను తెరిచి ఉంచుతారు. ఇందులో భాగంగానే శుక్రవారం ఉదయం తెలంగాణ నీటి పారుదలశాఖ అధికారులు సీడబ్ల్యూసీ ఈఈ చక్రపాణి, ఎస్సారెస్పీ ఏఈఈ రవి, వంశీ, సుప్రీం కోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ సభ్యుల పర్యవేక్షణలో బాబ్లీ జలాశయానికి ఉన్న 12 గేట్లను తెరిచారు. దీంతో ప్రాజెక్టులో నిల్వ ఉన్న ఒక్క టీఎంసీ నీరు దిగువకు రావడంతో గోదావరిలో నీటి ప్రవాహం పెరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని