పాఠశాలలకు రూ.100 కోట్ల నాబార్డు నిధులు!

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో రూ.7300 కోట్లతో వసతులు కల్పిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం నాబార్డు నుంచి రుణాన్ని తీసుకుంటోంది.

Published : 03 Jul 2022 06:19 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో రూ.7300 కోట్లతో వసతులు కల్పిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం నాబార్డు నుంచి రుణాన్ని తీసుకుంటోంది. అక్కడి నుంచి రూ.500 కోట్లు అప్పుగా పొందాలని భావిస్తోంది. అందులో ఇప్పటికే రూ.100 కోట్ల నిధులు వచ్చాయని విద్యాశాఖ వర్గాల ద్వారా తెలిసింది. మరో రూ.160 కోట్లు అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం(ఏసీడీపీ) నిధుల నుంచి తీసుకుంటోంది. ఇప్పటివరకు మొత్తం రూ.69 కోట్లు విడుదలయ్యాయి. అందులో 30 జిల్లాలకు రూ.2 కోట్ల చొప్పున, మూడు జిల్లాలకు రూ.3 కోట్ల చొప్పున ప్రభుత్వం విడుదల చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని