JNTUH: ఆన్‌లైన్‌లో చదువుకో.. నైపుణ్యం పెంచుకో: జేఎన్‌టీయూహెచ్‌లో సర్టిఫికెట్‌ కోర్సులు

కొలువులు దక్కించుకోవాలన్నా.. ఉద్యోగాల్లో ఉన్నతస్థాయికి ఎదగాలన్నా నైపుణ్యమే సోపానం. ఆ ఉద్దేశంతోనే జేఎన్‌టీయూహెచ్‌ స్కూల్‌ ఆఫ్‌ కంటిన్యూయింగ్‌ అండ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌(ఎస్‌సీఈడీ) విభాగం

Updated : 03 Jul 2022 09:45 IST

ఈనాడు, హైదరాబాద్‌: కొలువులు దక్కించుకోవాలన్నా.. ఉద్యోగాల్లో ఉన్నతస్థాయికి ఎదగాలన్నా నైపుణ్యమే సోపానం. ఆ ఉద్దేశంతోనే జేఎన్‌టీయూహెచ్‌ స్కూల్‌ ఆఫ్‌ కంటిన్యూయింగ్‌ అండ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌(ఎస్‌సీఈడీ) విభాగం ఆరు నెలల సర్టిఫికెట్‌ కోర్సులను ప్రవేశపెట్టింది. ఆన్‌లైన్‌ విధానంలో నడిచే ఈ కోర్సులను జేఎన్‌టీయూహెచ్‌తో పాటు ఐఐటీలు, ఎన్‌ఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఆచార్యులు బోధిస్తారు. సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు తరగతులు జరుగుతాయి.

ప్రస్తుతం ఉద్యోగావకాశాల్లో అధిక డిమాండ్‌ ఉన్న డేటా సైన్స్‌ విత్‌ ఫైథాన్‌ ప్రోగ్రామింగ్‌, బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ, క్లౌడ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆపరేషన్స్‌ కోర్సులను అందించనున్నారు. ఇప్పటికే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌(ఏఐ అండ్‌ ఎంఎల్‌), మెషిన్‌ లెర్నింగ్‌ కోర్సులు నడుస్తున్నాయి. వీటిలో చేరిన అభ్యర్థులకు 40 శాతం ల్యాబ్‌, 60 శాతం పరీక్షల్లోని మార్కులకు వెయిటేజీ ఇస్తారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 23లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఆగస్టు మూడో వారంలో తరగతులు మొదలుకానున్నాయి. 75 శాతం హాజరు తప్పనిసరి. దరఖాస్తు చేసుకునేందుకు వెబ్‌సైట్‌: ‌www.doa.jntuh.ac.in

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని