పేద విద్యార్థులకు ‘విద్యాదాన్‌’ స్కాలర్‌షిప్‌లు

రాష్ట్రంలో ఈ సంవత్సరం పదో తరగతిలో 90 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఇంటర్‌ చదువుతున్న 120 మంది పేద విద్యార్థులకు విద్యాదాన్‌ పేరిట

Published : 03 Jul 2022 06:19 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈ సంవత్సరం పదో తరగతిలో 90 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఇంటర్‌ చదువుతున్న 120 మంది పేద విద్యార్థులకు విద్యాదాన్‌ పేరిట సరోజిని దామోదరన్‌ ఫౌండేషన్‌ స్కాలర్‌షిప్‌లు అందజేయనుంది. ఇంటర్‌లో ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.10 వేల చొప్పున, వారు డిగ్రీలో చేరితే రూ.10 వేల నుంచి రూ.60 వేల వరకు స్కాలర్‌షిప్‌ ఇవ్వనుంది. విద్యార్థుల కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.2 లక్షలలోపు ఉండాలి. ఆసక్తి ఉన్నవారు ఈనెల 31లోపు  www.vidhyadhan.org అనే వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని ఫౌండేషన్‌ ఒక ప్రకటనలో తెలిపింది. మరిన్ని వివరాలకు 63003 91827 అనే నంబరుకు ఫోన్‌ చేయవచ్చంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని