అల్లూరికి స్వర నివాళి

అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల నేపథ్యంలో భీమవరంలో ఆయన విగ్రహాన్ని ఈనెల 4న ప్రధాని ఆవిష్కరిస్తున్న సందర్భంగా కవి ముకుందశర్మ ప్రత్యేక గీతం రచించారు.

Updated : 04 Jul 2022 00:27 IST

గీతాన్ని ఆవిష్కరించిన జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి

విజయవాడ: అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల నేపథ్యంలో భీమవరంలో ఆయన విగ్రహాన్ని ఈనెల 4న ప్రధాని ఆవిష్కరిస్తున్న సందర్భంగా కవి ముకుందశర్మ ప్రత్యేక గీతం రచించారు. దానికి గజల్‌ శ్రీనివాస్‌ సంగీతం సమకూర్చి, స్వయంగా పాడారు. ఈ ప్రత్యేక గీతాన్ని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి శనివారం విజయవాడలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అల్లూరి సీతారామరాజు దేశం కోసం చేసిన ప్రాణత్యాగం ఆచంద్రతారార్కం నిలిచి ఉంటుందన్నారు. ఆయన జీవిత చరిత్ర ప్రజల్లో దేశభక్తిని రగిలిస్తుందన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని