Published : 03 Jul 2022 06:19 IST

పేదల కోసం నిర్మాణం.. అక్కరకు రాని తీరు..!

చిత్రంలో కనిపిస్తున్నవి పేదల కోసం రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన రెండు పడకగదుల ఇళ్లు. ఇవి మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ మండలం ప్రతాపసింగారం గ్రామంలోనివి. వీటికి 2018లో అప్పటి మంత్రులు మహేందర్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేయగా ఏడాదిన్నర కిందట నిర్మాణం పూర్తయ్యాయి. ఇళ్లు లేని పేద ప్రజల కోసం నిర్మించిన వీటిని ఇంకా లబ్ధిదారులకు అందించకపోవడంతో ఆ గృహాల తలుపులు, కిటికీలు శిథిలావస్థకు చేరి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి.

-ఈనాడు, హైదరాబాద్‌

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts