Published : 03 Jul 2022 06:19 IST

చిత్రం.. భళారే!

ఈనాడు, హైదరాబాద్‌: ఒకవైపు తెలంగాణ ఉద్యమ చరిత్ర.. మరోవైపు పార్టీ ఆవిర్భావం, సిద్ధాంతాలు.. ప్రధాని మోదీ ఎనిమిదేళ్ల పాలనలో సాధించిన విజయాలు.. ఇలా వివిధ విశేషాలతో ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శన ఆకట్టుకుంటోంది. శనివారం నుంచి హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో ప్రారంభమైన భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఈ చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. దాదాపు 350 ఫొటోలు ఇక్కడ కొలువుదీరాయి. పార్టీ నేతలు శ్రీవర్ధన్‌రెడ్డి, రాకేశ్‌రెడ్డి, విఠల్‌, హైమా ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను 5 విభాగాలుగా  చేశారు. రాష్ట్ర చరిత్ర, తెలంగాణ ఉద్యమం, ఆజాదీకా అమృత్‌ మహోత్సవం, భాజపా ఆవిర్భావం.. ఎదుగుదల, మోదీ పాలనలో పథకాలు.. అంశాల ఆధారంగా ప్రదర్శన ఏర్పాటైంది. ప్రతి చిత్రం కింద దాని విశేషాలు, ఘటన జరిగిన తేదీలను అందరికీ అర్థమయ్యే రీతిలో తెలుగు, ఆంగ్లం, హిందీ భాషల్లో రాసి ఉంచారు. నిజాం పాలనలోని మహిళా సైనికుల చిత్రం ఆకట్టుకుంది. తెలంగాణ ఉద్యమంలో భాజపా పాత్రను వివరించేలా చిత్రాలు ఉంచారు. రాష్ట్రంలోని సందర్శనీయ స్థలాలు, ఆలయాలు వాటి ప్రాశస్త్యం గురించి వివరించారు. జాతీయ మీడియా సైతం ఫొటో ఎగ్జిబిషన్‌పై ప్రత్యేక దృష్టి సారించింది.

కృష్ణార్జునులు మోదీనే...

సహజంగా కురుక్షేత్ర సంగ్రామంలో రథంపై కృష్ణార్జునుల చిత్రాలు దర్శనమిస్తాయి. ఇందులో విశేషమేమిటంటే కృష్ణుడు, అర్జునుడు రెండు పాత్రలు మోదీనే పోషిస్తున్నారని తెలియజెప్పేలా చిత్రాన్ని ఏర్పాటు చేశారు. ఎనిమిదేళ్లుగా తీసుకువచ్చిన కీలక పథకాలు రథానికి వెనుక ఉన్నట్లుగా గీశారు. ఆయా పథకాలను ఎన్ని అవాంతరాలు ఎదురైనా కొనసాగిస్తున్నారనే స్ఫూర్తి వచ్చేలా చిత్రాన్ని ఏర్పాటు చేశారు. మోదీ రాష్ట్ర పర్యటనకు సంబంధించిన పలు చిత్రాలూ కొలువుదీరాయి.

ప్రత్యేక ఆకర్షణగా ఇసుక చిత్రాలు

చిత్ర ప్రదర్శనలో ఇసుకతో నరేంద్ర మోదీ జీవిత విశేషాలు, ప్రధాని అయ్యాక తీసుకువచ్చిన పథకాలతో చిత్రాలు గీయించారు. వీటిని ప్రత్యేకంగా రికార్డు చేయించి డిజిటల్‌ తెరలు ఏర్పాటు చేసి ప్రదర్శిస్తున్నారు. ఇది విశేషంగా ఆకట్టుకుంటోంది.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని