రాజ్‌భవన్‌లో ప్రధాని మోదీ బస

హైదరాబాద్‌లో నిర్వహించిన భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి రాజ్‌భవన్‌లో బస చేశారు. హెచ్‌ఐసీసీ నొవాటెల్‌లో

Published : 04 Jul 2022 03:23 IST

నేడు ప్రత్యేక విమానంలో ఏపీకి..

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో నిర్వహించిన భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి రాజ్‌భవన్‌లో బస చేశారు. హెచ్‌ఐసీసీ నొవాటెల్‌లో కార్యవర్గ సమావేశాలు ముగిశాక హెలికాప్టర్‌లో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానానికి వెళ్లారు. బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం రాత్రి 7.45 గంటల ప్రాంతంలో రోడ్డు మార్గాన రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. ప్రధాని బస దృష్ట్యా రాజ్‌భవన్‌ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ భద్రత కల్పించారు. ఆదివారం సాయంత్రం ఏడు గంటల నుంచే రాజ్‌భవన్‌కు దారితీసే మార్గాలన్నింటిలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు.

గవర్నర్‌ స్వాగతం 

ఆదివారం రాత్రి రాజ్‌భవన్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి గవర్నర్‌ తమిళిసై స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. గవర్నర్‌గా తన రెండేళ్ల అనుభవాలపై రూపొందించిన పుస్తకాలను, చిత్రపటం, జ్ఞాపిక బహూకరించారు. ఈ సందర్భంగా గవర్నర్‌తో మోదీ కొంతసేపు సమావేశమయ్యారు. సోమవారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో మోదీ ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు వెళ్లనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని