Published : 04 Jul 2022 06:19 IST

నేడు ఓ మోస్తరు వర్షాలు

ఈనాడు, హైదరాబాద్‌: బంగ్లాదేశ్‌ నుంచి ఝార్ఖండ్‌ వరకు 5.8 కిలోమీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని.. దీని ప్రభావంతో ఝార్ఖండ్‌పై సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. పశ్చిమ, నైరుతి భారత ప్రాంతాల నుంచి తెలంగాణలోకి తక్కువ ఎత్తులోకి గాలులు వీస్తున్నాయంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. ఆదివారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు అత్యధికంగా మునిగాలవీడు(మహబూబాబాద్‌ జిల్లా), మంగళపల్లె(రంగారెడ్డి)ల్లో 5.5, పుల్కల్‌(సంగారెడ్డి)లో 5.3, పాత రాజంపేట(కామారెడ్డి)లో 4.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వర్షాలతో ఉష్ణోగ్రత సాధారణంకన్నా 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గి వాతావరణం చల్లబడింది.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని