భాజపా సమావేశాల్లో నిఘా అధికారి కలకలం

భాజపా జాతీయ కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్‌ అధికారి ప్రవేశించడంతో కొంతసేపు కలకలం రేగింది. దీనిపై భాజపా నాయకత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. నిఘా అధికారిని గుర్తించి పట్టుకున్నట్లు భాజపా సీనియర్‌ నేత ఇంద్రసేనారెడ్డి

Published : 04 Jul 2022 06:19 IST

భాజపా జాతీయ కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్‌ అధికారి ప్రవేశించడంతో కొంతసేపు కలకలం రేగింది. దీనిపై భాజపా నాయకత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. నిఘా అధికారిని గుర్తించి పట్టుకున్నట్లు భాజపా సీనియర్‌ నేత ఇంద్రసేనారెడ్డి తెలిపారు. సమావేశం లోపల కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూలు పుస్తకాన్ని ఆ అధికారి మొబైల్‌ ఫోన్‌లో ఫొటోలు తీశారని చెప్పారు. ఆ ఫొటోలను తొలగించి అధికారిని పోలీసు కమిషనర్‌కు అప్పజెప్పినట్లు వెల్లడించారు.భాజపా జాతీయ కార్యవర్గ అంతర్గత సమావేశంలోకి అధికారిని పంపి నిఘా పెట్టడం మంచి పద్ధతి కాదని ఈ సందర్భంగా ఇంద్రసేనారెడ్డి అన్నారు. గతంలో సమావేశాలు నిర్వహించినప్పుడు ఎవరూ ఇలా చేయలేదని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని