Published : 04 Jul 2022 06:19 IST

ఏపీ రాజధాని రైతుల ప్లాట్లలో వసతుల కల్పనకు నేడు శ్రీకారం

ఈనాడు, అమరావతి: హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఏపీ రాజధాని అమరావతిలో రైతుల ప్లాట్లలో మౌలిక వసతుల కల్పనకు ఎట్టకేలకు అధికారులు కదిలారు. సోమవారం జోన్‌-4లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. నిధుల కొరత దృష్ట్యా తొలుత రూ.192.52 కోట్ల విలువైన పనులు మొదలుపెట్టి, దశల వారీగా చేపట్టాలని సీఆర్డీఏ నిర్ణయించింది. ఇందులో మొత్తం 4వేలకు పైగా రైతుల ప్లాట్లు ఉన్నాయి. ఈ జోన్‌లో ఎల్పీఎస్‌, బృహత్‌ ప్రణాళికలోని ప్రాంతం 1,358 ఎకరాలు ఉంది. ప్రాధాన్యం మేరకు తొలుత రహదారులు, విద్యుత్తు స్తంభాల ఏర్పాటు, తాగునీరు, వరద నీటి కాలువల వంటి వసతులు కల్పించనున్నారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని