Published : 04 Jul 2022 06:17 IST

9 మంది ఏబీవీపీ నాయకుల రిమాండ్‌

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: ధర్నా చేసేందుకు వచ్చి పోలీసుల పట్ల దురుసుగా, అసభ్యకరంగా ప్రవర్తించి, గాయాలయ్యేలా వ్యవహరించిన ఏబీవీపీ నాయకులను రిమాండ్‌కు తరలించినట్లు సైఫాబాద్‌ పోలీసులు తెలిపారు. రాష్ట్రంలో పాఠశాల విద్యను ప్రభుత్వం నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తోందంటూ లక్డీకాపుల్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌ ఎదుట ఏబీవీపీ ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలోనే కొందరు మహిళా కానిస్టేబుళ్ల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని పోలీసులు 34 మందిని అరెస్టు చేశారు. ఇందులో కీలకంగా గుర్తించిన 9 మందిని ఆదివారం రిమాండ్‌కు తరలించి, మిగతా వారికి స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చినట్లు పేర్కొన్నారు. పాఠశాలల దుస్థితిపై ధర్నాకు దిగితే పోలీసులు లాఠీలతో కొట్టడమే కాకుండా రిమాండ్‌కు తరలించారని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు.

రేపు పాఠశాలల బంద్‌

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, పాఠ్యపుస్తకాలు, ఉపాధ్యాయులు లేకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 5న తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలల బంద్‌కు పిలుపు ఇస్తున్నట్లు ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, హైదరాబాద్‌ విభాగ్‌ కన్వీనర్‌ కమల్‌ సురేష్‌ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని