ప్రభుత్వాల నియంతృత్వంపై ధిక్కార స్వరం వినిపించాలి

దేశంలో పాలకుల నియంతృత్వం పెరిగిపోతున్న నేపథ్యంలో కవులు, రచయితలు, ప్రజాస్వామ్యవాదులు ఏకమై ప్రభుత్వాలపై ధిక్కార స్వరం వినిపించి హక్కులను కాపాడుకోవాలని వక్తలు సూచించారు. ఆదివారం హైదరాబాద్‌ సుందరయ్య కళానిలయంలో

Published : 04 Jul 2022 06:21 IST

విరసం 52వ ఆవిర్భావ సభలో వక్తలు

బాగ్‌లింగంపల్లి, న్యూస్‌టుడే: దేశంలో పాలకుల నియంతృత్వం పెరిగిపోతున్న నేపథ్యంలో కవులు, రచయితలు, ప్రజాస్వామ్యవాదులు ఏకమై ప్రభుత్వాలపై ధిక్కార స్వరం వినిపించి హక్కులను కాపాడుకోవాలని వక్తలు సూచించారు. ఆదివారం హైదరాబాద్‌ సుందరయ్య కళానిలయంలో విప్లవ రచయితల సంఘం(విరసం) 52వ ఆవిర్భావ సభ జరిగింది. విరసం సీనియర్‌ సభ్యుడు, కవి అల్లం రాజయ్య మాట్లాడుతూ చట్టాల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. విరసం ఉమ్మడి రాష్ట్రాల అధ్యక్షుడు అరసవిల్లి కృష్ణ మాట్లాడుతూ దివంగత కవి చెరబండ రాజు స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. విరసం ఆధ్వర్యంలో రూపొందించిన చెరబండ రాజు సమగ్ర సాహిత్య పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. విరసం వ్యవస్థాపక సభ్యురాలు కృష్ణబాయి, కవి నగ్నముని, వీక్షణం సంపాదకుడు ఎన్‌.వేణుగోపాల్‌, విరసం సభ్యులు సుదర్శన్‌, రత్నమాల, రుక్మిణి, రాము, ఖాదర్‌, చెంచయ్య పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని