Updated : 04 Jul 2022 11:22 IST

Jute bag: ప్లాస్టిక్‌ పనిపట్టండి.. ఈ సంచి చేపట్టండి

చిత్రంలో కనిపిస్తున్న సంచి జనపనారతో రూపుదిద్దుకొంది. చూడడానికి ఒకటిగానే కనిపిస్తున్నా సంచిని తెరచిచూస్తే ఏడు అరలు ఉంటాయి. ఒక్కో అరలో ఒక్కో రకం సరకును పెట్టుకునే సౌలభ్యముంది. ప్రభుత్వం ఈ నెల ఒకటో తేదీ నుంచి ‘ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌’ను నిషేధించిన నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలానికి చెందిన సాధికారత మండల సమాఖ్య మహిళా సభ్యులు ఈ సంచులను తయారుచేస్తున్నారు. మార్కెట్‌లో కూరగాయలు, పండ్లు, కిరాణా సరకులను తెచ్చుకోవడానికి ఇవి చక్కగా ఉపయోగపడతాయి.. ఒక్కోటి రూ.270 చొప్పున వీటిని విక్రయిస్తున్నట్లు సమాఖ్య ప్రతినిధి రాధిక చెప్పారు. వస్త్రంతోనూ సంచులను రూపొందిస్తున్నామని ఆమె తెలిపారు. ధరలు అందరికీ అందుబాటులో ఉండేలా రూ.12 నుంచి రూ.20కే అమ్ముతున్నట్లు వివరించారు.

 - ఈనాడు డిజిటల్‌, మహబూబాబాద్‌
 

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని