Updated : 05 Jul 2022 06:02 IST

వేసవిలోనూ నాణ్యమైన విద్యుత్తు

ఎఫ్‌టీసీసీఐ ఎక్స్‌లెన్స్‌ అవార్డుల ప్రదానంలో కేటీఆర్‌

మాదాపూర్‌, న్యూస్‌టుడే: వేసవిలో కూడా 24 గంటలు నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కె.టి.రామారావు అన్నారు. సోమవారం సాయంత్రం తెలంగాణ వాణిజ్య, పారిశ్రామిక మండళ్ల సమాఖ్య (ఎఫ్‌టీసీసీఐ) ఎక్స్‌లెన్స్‌ పురస్కారాల ప్రదాన కార్యక్రమాన్ని హైదరాబాద్‌ మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి ఉత్తమ సేవలందిస్తూ ప్రగతిబాటలో నడుస్తున్న 19 పరిశ్రమలకు పురస్కారాలను అందజేశారు. అనంతరం మాట్లాడారు. ‘‘ఉమ్మడి రాష్ట్రంలో పవర్‌ హాలిడేలతో అప్పట్లో పరిశ్రమవర్గాలు ధర్నాలు చేశాయి. 8 ఏళ్లుగా పరిశ్రమలకు, గృహావసరాలకు విద్యుత్తు సరఫరా చేస్తూనే, వ్యవసాయరంగానికి 24 గంటలు ఉచితంగా అందజేస్తున్నాం. పారిశ్రామిక రంగంలో ఒకప్పుడు గుజరాత్‌, మహారాష్ట్ర, కర్ణాటకలు ముందుండేవి. ఇప్పుడు తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. టీఎస్‌ఐపాస్‌ లాంటి మెరుగైన పారిశ్రామిక విధానాలను అమలు చేస్తున్నాం. 8 ఏళ్లలో వచ్చిన పెట్టుబడుల్లో 24 శాతం ఇక్కడ ఉన్న సంస్థలే మళ్లీ పెట్టుబడులు పెట్టి తమ వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నాయి. హైదరాబాద్‌లోనే కాకుండా రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లోనూ పారిశ్రామిక పెట్టుబడులు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే ఏడు ఐటీ కంపెనీలు వరంగల్‌తో పాటు ఇతర నగరాల్లో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకు వచ్చాయి. నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌లో కంపెనీలు ప్రారంభించేందుకు మౌలిక వసతులను అభివృద్ధి చేయడం జరిగింది’’ అని వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌, ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు కె.భాస్కర్‌రెడ్డి, ఎక్స్‌లెన్స్‌ అవార్డ్సు కమిటీ ఛైర్మన్‌ గౌర శ్రీనివాస్‌ ఉన్నారు.

పురస్కార గ్రహీతల వివరాలు..

1) ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఇండస్ట్రియల్‌ ప్రొడెక్టివిటీ- హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌, హైదరాబాద్‌

2) ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఆల్‌రౌండ్‌ పెర్ఫార్మెన్స్‌- మెట్రో కెమ్‌ ఏపీఐ ప్రైవేటు లిమిటెడ్‌, హైదరాబాద్‌

3) ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఆగ్రోబేస్డ్‌ ఇండస్ట్రీ- సామ్‌ అగ్రిటెక్‌ లిమిటెడ్‌, హైదరాబాద్‌

4) ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ మార్కెటింగ్‌ ఇన్నోవేషన్‌- బీఫాచ్‌ 4ఎక్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌, హైదరాబాద్‌

5) ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఎక్స్‌పోర్ట్‌ పెర్ఫార్మెన్స్‌- రవి ఫుడ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ రంగారెడ్డి

6) ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఎక్స్‌పోర్ట్‌ పెర్ఫార్మెన్స్‌(మైక్రో స్మాల్‌ ఎంటర్‌ప్రైజ్‌)- సర్వోత్తమ్‌ కేర్‌ లిమిటెడ్‌- సికింద్రాబాద్‌

7) ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ సీఎస్‌ఆర్‌- ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌, సికింద్రాబాద్‌

8) ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ప్రాడెక్ట్‌ ఇన్నోవేషన్‌- స్కైషేడ్‌ డేలైట్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌, హైదరాబాద్‌

9) ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ప్రాజెక్ట్‌ ఇన్నోవేషన్‌(మైక్రో స్మాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌)- కన్వర్జ్‌ బయోటెక్‌ ప్రైవేటు లిమిటెడ్‌, హైదరాబాద్‌

10) ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఇన్నోవేటివ్‌ ప్రాడెక్ట్‌, సర్వీస్‌ ఇన్‌ హెల్త్‌కేర్‌ విత్‌ హయ్యస్ట్‌ ఇంపాక్ట్‌- క్లిక్‌ టూ క్లినిక్‌ హెల్త్‌కేర్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌, హైదరాబాద్‌

11) ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌- మైత్రీ డ్రగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, హైదరాబాద్‌

12) ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (మైక్రో స్మాల్‌ ఎంటర్‌ప్రైజస్‌) సహస్ర క్రాప్‌ సైన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, హైదరాబాద్‌

13) అవుట్‌ స్టాండింగ్‌ కంట్రిబ్యూషన్‌ టు ది ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ ఇండస్ట్రి- అనంత్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌, హైదరాబాద్‌

14) ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఐటీ- వివిడ్‌ మైండ్స్‌ టెక్నాలజీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌, హైదరాబాద్‌

15) ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ టూరిజం ప్రమోషన్‌- సురేంద్ర అసోసియేట్స్‌, హైదరాబాద్‌

16) ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ అసోసియేషన్‌, ఛాంబర్‌ ఫర్‌ సర్వీసింగ్‌ ఇండస్ట్రీ కామర్స్‌ అండ్‌ ఎకానమీ- సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌, హైదరాబాద్‌

17) ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ సైన్స్‌ ఆర్‌ ఇంజినీరింగ్‌- గణేశ్‌ సైంటిస్ట్‌-ఎఫ్‌, ఇంటర్నేషనల్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ పవర్‌ మెటలర్జీ అండ్‌ న్యూ మెటీరియల్స్‌, హైదరాబాద్‌

18) అవుట్‌ స్టాండింగ్‌ ఉమెన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌- దీపా దాడు(ఎన్‌చాంట్‌ కేఫ్‌ అండ్‌ కాన్‌ఫెక్షనరీ వ్యవస్థాపకురాలు)

19) ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ సోషల్‌ వెల్ఫేర్‌ యాక్టివిటీస్‌ ఫర్‌ ఉమెన్‌ ఎంపర్‌మెంట్‌- నవభారత్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని