ఘనంగా ముగిసిన ఆటా మహాసభలు

అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌(ఆటా) 17వ మహాసభలు వాషింగ్టన్‌లో ఘనంగా ముగిశాయి. తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికాలో స్థిరపడ్డ ఎన్‌ఆర్‌ఐల కుటుంబాలకు చెందిన 15 వేల మంది ఒకేచోట కలిసి మూడు రోజులపాటు

Published : 05 Jul 2022 05:49 IST

హాజరైన మంత్రులు ఎర్రబెల్లి, ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు

ఈనాడు, హైదరాబాద్‌: అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌(ఆటా) 17వ మహాసభలు వాషింగ్టన్‌లో ఘనంగా ముగిశాయి. తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికాలో స్థిరపడ్డ ఎన్‌ఆర్‌ఐల కుటుంబాలకు చెందిన 15 వేల మంది ఒకేచోట కలిసి మూడు రోజులపాటు వేడుకలు జరుపుకొన్నారు. వీటికి తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, గ్యాదరి కిషోర్‌, చంటి క్రాంతికిరణ్‌, రవీంద్రకుమార్‌, కాలే యాదయ్య, గువ్వల బాలరాజు, మల్లయ్యయాదవ్‌, టీఎస్‌ఐఐసీ ఛైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, పలువురు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ముగింపు రోజున సంగీత దర్శకుడు తమన్‌, ఈషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్‌ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ అభివృద్ధికి ఊతమివ్వాలి: ఎమ్మెల్సీ కవిత  

విదేశాల్లో స్థిరపడ్డ ప్రవాసీయులు సొంతగడ్డ రుణం తీర్చుకునేందుకు వీలైనంత సహకారం అందించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. వాషింగ్టన్‌లో తెరాస అమెరికా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వినూత్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రవాసులు భాగస్వాములు కావాలన్నారు. ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు, తెరాస ప్రవాస విభాగాల సమన్వయకర్త మహేశ్‌ బిగాల పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని