దక్షిణాది ఉత్తమ వైద్యులలో డా.నరేంద్రకుమార్‌కు చోటు

తెలంగాణ ప్రభుత్వ వైద్యుడు మరో ఘనత సాధించారు. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘టాప్‌ డాక్టర్స్‌ ఇన్‌ సౌత్‌-2022’ అనే అంశంపై ‘ఇండియా టుడే’ నిర్వహించిన

Published : 05 Jul 2022 05:52 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వ వైద్యుడు మరో ఘనత సాధించారు. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘టాప్‌ డాక్టర్స్‌ ఇన్‌ సౌత్‌-2022’ అనే అంశంపై ‘ఇండియా టుడే’ నిర్వహించిన సర్వేలో దక్షిణాదిన ఉత్తమ వైద్యుల్లో ఒకరుగా డాక్టర్‌ ఎ.నరేంద్రకుమార్‌ ఎంపికయ్యారు. ఈయన ప్రస్తుతం తెలంగాణలో వైద్యవిద్య అదనపు సంచాలకులు, వనపర్తి బోధనాసుపత్రి సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. సర్వేకు సంబంధించి మొత్తం 52 విభాగాల్లో 379 మంది వైద్యులు ఎంపిక కాగా.. హైదరాబాద్‌ నుంచి 70 మందికి ఆ జాబితాలో చోటు దక్కింది. వీరిలో 69 మంది ప్రైవేటు డాక్టర్లే కాగా.. నరేంద్రకుమార్‌ ఒక్కరే ప్రభుత్వ వైద్యుడు కావడం విశేషం. దక్షిణ భారత్‌లో అత్యుత్తమ వైద్యుల జాబితాలో పీడియాట్రిక్‌ సర్జరీ విభాగంలో ఏడుగురిని ఎంపిక చేయగా..అందులో ఒకరుగా నరేంద్రకుమార్‌ ఎంపికయ్యారు. తాజా గుర్తింపు నేపథ్యంలో డాక్టర్‌ నరేంద్రకుమార్‌కు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అభినందనలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని