రైతుబంధు కింద రూ.3,946 కోట్ల జమ

అర్హులైన రైతులందరికీ రైతుబంధు నిధులు అందజేయాలని అధికారులను ఆర్థికమంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఈ పథకం కింద సోమవారం నాటికి 4 ఎకరాల వరకు భూమి కలిగిన మొత్తం 51.99 లక్షల మంది రైతుల ఖాతాల్లో

Published : 05 Jul 2022 05:52 IST

రేపు అయిదు ఎకరాలపైబడి ఉన్నవారికి పంపిణీ
మంత్రి హరీశ్‌రావు ప్రకటన

ఈనాడు, హైదరాబాద్‌: అర్హులైన రైతులందరికీ రైతుబంధు నిధులు అందజేయాలని అధికారులను ఆర్థికమంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఈ పథకం కింద సోమవారం నాటికి 4 ఎకరాల వరకు భూమి కలిగిన మొత్తం 51.99 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3,946 కోట్లు జమచేశామన్నారు. నిధుల జమ ప్రక్రియలో ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతుబంధు నిధుల విడుదలపై ఆర్థికమంత్రి సోమవారం తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. బుధవారం అయిదు ఎకరాలపైబడి ఉన్న రైతుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. ఈ సమీక్షలో రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్‌రాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు