వన్‌టైం సెటిల్‌మెంట్‌ గడువు 31 వరకు పెంపు

రాష్ట్రంలో వాణిజ్య పన్నులశాఖ మొండిబకాయిల చెల్లింపునకు సంబంధించిన వన్‌టైం సెటిల్‌మెంట్‌ దరఖాస్తు గడువును జులై 31 వరకు పొడిగిస్తూ రాష్ట్ర వాణిజ్యపన్నులశాఖ సోమవారం

Published : 05 Jul 2022 05:52 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో వాణిజ్య పన్నులశాఖ మొండిబకాయిల చెల్లింపునకు సంబంధించిన వన్‌టైం సెటిల్‌మెంట్‌ దరఖాస్తు గడువును జులై 31 వరకు పొడిగిస్తూ రాష్ట్ర వాణిజ్యపన్నులశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్‌ 30తో గడువు ముగియగా ఈ నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ దరఖాస్తుల బకాయిలను నిర్దారించి ఆగస్టు 15లోపు సమాచారం ఇస్తారు. అంగీకరించిన పన్ను బకాయి మొత్తం చెల్లింపునకు ఆగస్టు 31 వరకు గడువు ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని