Published : 06 Jul 2022 05:58 IST

మరో 4 ఎస్టీ గురుకులాల్లో జేఈఈ-ఎంసెట్‌ శిక్షణ

మంత్రి సత్యవతి రాథోడ్‌ వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌లో ఉన్న ఐఐటీ, జేఈఈ, ఎంసెట్‌ శిక్షణ తరహాలో ఖమ్మం, వరంగల్‌, పరిగి, హయత్‌నగర్‌లలోని గురుకులాల్లో ఈ ఏడాది శిక్షణ తరగతులు ప్రారంభిస్తామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. రాష్ట్రంలోని గిరిజన గురుకుల పాఠశాలలను దశలవారీగా కళాశాలలుగా మారుస్తామన్నారు. హైదరాబాద్‌ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో మంగళవారం ఆమె ఎస్టీ గురుకుల ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో 183 ఎస్టీ గురుకులాల్లో కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. వీటిలోని 991 మంది విద్యార్థులు ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక సంస్థల్లో మెడిసిన్‌, ఇంజినీరింగ్‌ సీట్లు పొందినట్లు తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు గురుకులాల్లో విద్యాప్రమాణాలను మరింత పెంచేందుకు యత్నిస్తున్నట్లు చెప్పారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని