అంతా మొక్కు‘బడి’

పాఠశాలలు పునఃప్రారంభానికి ముందు హడావుడి చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు శిథిలావస్థకు చేరిన పాఠశాల పరిస్థితులు పట్టించుకోలేదనడానికి సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం అంతారం గ్రామంలోని ఉన్నత పాఠశాలే నిదర్శనం. మంగళవారం ఉదయం విద్యార్థులంతా

Published : 06 Jul 2022 05:41 IST

ఊడిన పెచ్చులు.. తప్పిన ప్రమాదం

పాఠశాలలు పునఃప్రారంభానికి ముందు హడావుడి చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు శిథిలావస్థకు చేరిన పాఠశాల పరిస్థితులు పట్టించుకోలేదనడానికి సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం అంతారం గ్రామంలోని ఉన్నత పాఠశాలే నిదర్శనం. మంగళవారం ఉదయం విద్యార్థులంతా ప్రార్థన చేస్తున్న సమయంలో పదోతరగతి గదిలో పెద్ద శబ్దంతో సీలింగ్‌ నుంచి సిమెంట్‌ పెచ్చులు ఊడి బెంచీలపై పడ్డాయి. ఆ సమయంలో అక్కడ విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ పాఠశాలలోని ప్రతి గదిలోనూ ఇదే పరిస్థితి నెలకొందని, వర్షం వస్తుందంటే భయం గుప్పిట్లో బడిని కొనసాగించాల్సి వస్తుందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనేకసార్లు ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులకు విన్నవించినా... పట్టించుకునే వారే లేరని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.

- న్యూస్‌టుడే, మునిపల్లి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని